22 April, 2026 | 2:53 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

22-04-2026 01:11 PM

హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచారు. మియాపూర్-ఎల్బీనగర్(Miyapur–LB Nagar) మార్గంలో 4 నిమిషాల 20 సెకన్లకో మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండనుంది. నాగోల్-రాయదుర్గం(Nagole to Raidurg Metro) మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో రైల్ పట్టాలపైకి రానుంది. ఆర్టీసీ సమ్మె(RTC Strike) కాలంలో 56 మెట్రో రైళ్లు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమ్మె వల్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. 

ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హైదరాబాద్ ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గమైన మెట్రో రైల్(Metro Rail) కోసం క్యూ కడుతున్నారు. ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడంతో మెట్రో టికెట్ కౌంటర్లు, ఎంట్రీ గేట్స్, ప్లాట్ ఫార్మ్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది. దీంతో మెట్రో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.