కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు హర్షణీయం
హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) నివేదికపై హైకోర్టు తీర్పు హర్షణీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా.. కాంగ్రెస్ కక్షపూరిత విధానాలు మార్చుకోవాలని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై నిందలు వేసి.. కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరానికి రెండున్నరేళ్ల మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. గత్యంతరం లేక ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కేసీఆర్, హరీశ్ రావులతో పాటు స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీకి ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు వెల్లడించింది.






