21 May, 2026 | 2:57 AM

జాతీయ అభివృద్ధికి పరిశోధనలు ఎంతో కీలకం

21-05-2026 01:38 AM

చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తంరెడ్డి

మొయినాబాద్, మే 20 (విజయక్రాంతి): జాతీయ అభివృద్ధికి పరిశోధనలు ఎంతో కీలకమని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్లో ఉన్న చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఏ స్టడీ ఆఫ్ సం మేథమేటికల్ మోడలింగ్ ఆన్ సైన్-ఎకాలజీ విత్ నేచురల్ గ్రోత్ రేట్స్ అనే అంశంపై శ్వేత శ్రీవాస్తవ చేసిన పరిశోధనకు పీహెచ్.డీ డిగ్రీ ప్రదానం చేశారు. ఈ పరిశోధన ఆచార్య బి. హరిప్రసాద్ పర్యవేక్షణలో పూర్తయింది. ఈ సందర్భంగా డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. గణితం మరియు గణాంకాల విభాగంలో జరుగుతున్న పరిశోధనలు దేశ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

సహజ వృద్ధి రేట్లతో కూడిన పర్యావరణ శాస్త్రంపై గణిత నమూనాల అధ్యయనం చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. విద్యా పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రభావవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్. సాత్వికా రెడ్డి, వైస్ ఛాన్సలర్ జీ. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఎం. రవీందర్, క్రిస్టోఫర్, ఏ. రాజు, ఎస్. కవిత, బి. రాజేందర్ రెడ్డి, ఈ. జగదీష్ కుమార్, బి. హరిప్రసాద్, డాక్టర్ కె. స్పందన, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.