30 April, 2026 | 3:37 AM

గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్

30-04-2026 02:16 AM

జీసీసీలను జీవీసీలుగా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్

రెడీ టూ వర్క్ ఫోర్స్, ఇన్నోవేషన్ ఎకోసిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి

హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబ ల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెం టర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామన్నారు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్ కంపెనీ నానక్ రాంగూ డ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇం డియా’ పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం మంత్రి శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.

హైదరాబాద్‌ను కేవలం ఐటీ డెస్టినేషన్‌గా కాకుండా, ప్రపంచశ్రేణి వ్యాపార పరిష్కారాల కూ చిరునామాగా మారుతోందన్నా రు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొ దలు.. మ్యానుఫ్యాక్చరింగ్, క న్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కో సం హైదరాబాద్‌నే మొదటి ప్రా ధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నా రు. ఆ జాబితాలో 150 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచపటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిం చేలా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై దృష్టి సారించామన్నారు. తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాకుండా, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముం దుకు సాగుతున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ.. ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అన లిటి క్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్‌గా పనిచేస్తుందన్నారు.

ప్రస్తుతం 300 మంది కి పైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1600కు చేరుకుంటుందన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్/సీఎఫ్ వో హెరాల్ వాన్ డెన్ బ్రోక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్ డెన్ ఎల్జెన్, హేనెకెన్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ తదితరులు పాల్గొన్నారు.