9 June, 2026 | 12:34 PM

తాటి చెట్టు పైన గుండెపోటుతో వెంకన్న మృతి

09-06-2026 11:10 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైన గుండెపోటు రావడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మద్దిరాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మద్దిరాల గ్రామానికి చెందిన చామకూరి వెంకన్న(56), నిత్యం కళ్ళు గీసే సందర్భంలో భాగంగా ఉదయం తాటి చెట్టు ఎక్కుతుండగా, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో, చెట్టుపైనే మృతి చెందడం జరిగింది. దీనితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించనున్నట్లు తెలిపారు