23-02-2026 02:18:55 AM
నగదు, బంగారంతో పరార్
చేగుంట, ఫిబ్రవరి 22: మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారం విషయంలో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త.. తన భార్య గొంతు కోసి హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్టం నెల్లూరు జిల్లాకు చెందిన కనుకుర్తి వరలక్ష్మి, కనుకుర్తి త్రిమూర్తి దంపతులు చేగుంటలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు.
ఇద్దరి మధ్య గత కొంతకాలంగా బంగారం, డబ్బు విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన త్రిమూర్తి ఇంట్లో ఉన్న కత్తితో వరలక్ష్మి (36)పై దాడి చేసి, ఇంట్లో ఉన్న డబ్బు, బంగారంతో పరారయ్యాడు. తీవ్ర గాయాల కారణంగా వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్, చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుడు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.