07-02-2026 08:22:19 PM
మర్రిగూడ,((విజయక్రాంతి): ఓ ప్రభుత్వ ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధమును తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురైన గ్రామం వెంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకేపల్లి తండాలో శనివారం చోటుచేసుకుంది. మర్రిగూడ పోలీసులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన జటావత్ బాలాజీ (35) భార్య జటావత్ రజిత విధి నిర్వహణలో భాగంగా అదే గ్రామం చెందిన దగ్గర వరుసైన మరిది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జటావత్ హాథీరామ్ గత కొన్ని నెలలుగా అక్రమ సంబంధం పెట్టుకుంది.
తన భర్త బాలాజీ హైదరాబాదులో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తూ అప్పుడప్పుడు వస్తుంటాడు అదే తరుణంలో ఈనెల రెండో తారీకున తన భార్య రజిత హాథిరామ్ నిర్వాహకాన్ని భర్త బాలాజీ కళ్లారా చూశాడు దీంతో హతాహుషూడైన బాలాజీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గతంలో రెండు మూడుసార్లు ఇలాంటి అక్రమాలు కూడదని గ్రామంలోని పెద్దల మధ్య హెచ్చరించినట్లు గ్రామస్తులు తెలిపారు ఉరి వేసుకున్న సమయంలో తన కుమారుడు చరణ్ ఐదవ తరగతి చదువుతూ నాడు సంఘటనను ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వెంటనే చికిత్స నిమిత్తము హైదరాబాదుకు హాస్పిటల్ తరలించారు.
చికిత్స పొందుతూ బాలాజీ శనివారం చనిపోయాడు మృతుడి తమ్ముడు జటావత్ సాగర్ తన అన్న మరణానికి కారణమైన రజిత హాథిరంపై చర్యలు తీసుకునేందుకు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని దేవరకొండ ప్రభుత్వాన్ని ఆస్పత్రికి తరలించారు ఈ ఏడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డ్ మెంబర్ గా గెలుపొందారు మృతుడికి ఒక కుమార్తె దీక్ష కుమారుడు చరణ్ ఉన్నారు భార్య నిర్వాకం ఓ నిండు ప్రాణం బలి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ప్రభుత్వ ఉద్యోగ ఉంటూ అక్రమ వ్యసనాలకు పాల్పడిన ఉపాధ్యాయుడు జటావత్ హాథిరంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు