నేడు 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
24-04-2026 04:55 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం నందు నేడు 14 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సుజన్ కుమార్ మాట్లాడుతూ... హెచ్పీవీ వ్యాక్సిన్ 14 సంవత్సరాల ఆడపిల్లలకు ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్త కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందని తెలిపారు.కావున ఉదయం 10:30కు స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం నందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.మండలంలోని ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలని కోరారు.






