18 August, 2026 | 3:03 AM

పనసపల్లి ఫ్యాన్స్ వార్ ఎక్కడిదాకా వెళ్లింది?

18-08-2026 12:12 AM

‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’. ఈ చిత్రాన్ని వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. దీన్ని విలేజ్ బ్యాక్‌డ్రాప్ పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సీహెచ్ రవికిషోర్ తెరకెక్కిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సప్తగిరి కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజా రవీందర్, బాబుమోహన్, వంశీధర్‌గౌడ్, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అశోక్, జబర్దస్త్ అప్పారావు ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.

మేకర్స్ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరో ‘పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్’ సంఘానికి, హీరోయిన్ బాలకృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్లు. మరి వీరి మధ్య ఫ్యాన్ వార్ ఎక్కడి దాకా వెళ్లింది..? ఎలా వినోదాన్ని పంచింది..? అనే అంశాలతో సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: మోహన్ చారి; సంగీతం: ఎంఎల్ రాజా; ఎడిటర్: నరేశ్ అడుపా.