18 August, 2026 | 4:00 AM

అమితాబ్ సినిమాతో పోల్చడం గొప్ప ప్రశంస

18-08-2026 12:10 AM

మాధవిరెడ్డి సోమ నిర్మించిన తొలిచిత్రం ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు.

ఆగస్టు 21న రిలీజ్ కానున్న ఈ  చిత్ర విశేషాల్ని డైరెక్టర్ రమణారెడ్డి సోమ మీడియాతో పంచుకున్నారు. “మా చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ మూవీ ని చాలా మంది డైరెక్టర్లు, యాక్టర్లకు చూపించా. వీఎన్ ఆదిత్య ఈ సినిమాను అమితాబ్ ‘ఝుండ్’, రణ్ వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చారు. రైటింగ్ అద్భుతంగా ఉందన్న ఆయన ప్రశంసను నేను మర్చిపోలేను” అని తెలిపారు.