23 June, 2026 | 5:55 PM

ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్

23-06-2026 05:07 PM
  1. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పరార్
  2. నోట్ల కట్టలతో ఉన్న ట్రంక్ బాక్స్ నుంచి నగదు మాయం
  3. పక్కా స్కెచ్‌తో చోరీ చేసినట్లు పోలీసుల అనుమానం
  4. ఐఎస్ సదన్ లో ఏటీఎంలో నింపాల్సిన డబ్బు చోరీ 

హైదరాబాద్: నగరంలోని (Hyderabad old cityఐఎస్ సదన్(IS Sadan)లో ఏటీఎంలో నింపాల్సిన డబ్బు చోరీ జరిగింది. ఏటీఎంలో డబ్బు పెడుతుండగా దుండగులు రూ. 17 లక్షలు ఎత్తుకెళ్లారు. వ్యాన్ సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లగానే ఇద్దరు దుండగులు నోట్ల కట్టల ట్రంప్ పెట్టేతో పారిపోయారు. ఏటీఎం క్యాష్ డ్రైవర్ ఘటనాస్థలంలో కనిపించకుండా పోవడం గమనార్హం. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్(ATM cash van driver) మరొకరితో కలిసి దోపిడీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొద్ది దూరంలో మరోవ్యక్తి బైక్ తో ఉండగా వ్యాన్ డ్రైవర్ డబ్బు పెట్టెతో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్(CCTV footage) ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం చార్మినార్ జోన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలోప్రత్యేక బృందాల గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవర్‌కు సహకరించిన వ్యక్తుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.