ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
01-08-2026 06:39 PM
నిజామాబాద్,(విజయ క్రాంతి): ఆదివారం నిర్వహించనున్న నిజామాబాద్ ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం పరిశీలించారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టిందని ఆయన తెలిపారు. ఇందుకోసం భారీగా పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు. అలాగే అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.






