అనారోగ్య కారణాలతో మాజీ ఉపసర్పంచ్ మృతి
26-08-2026 08:31 PM
పార్థివదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ కుంజా రవి, మాజీ సర్పంచ్ పత్తిలాల్
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన ఉమ్మడి పూసుగూడెం పంచాయతీ మాజీ సర్పంచ్ సున్నం ముత్తయ్య(58) అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న సీతారాంపురం పంచాయితీ సర్పంచ్ కుంజా రవి, మాజీ సర్పంచి భూక్యపత్తిలాల్ ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి చెందిన ముత్తయ్య కొడుకు సున్నం దావీదు ప్రస్తుతం సీతారాంపురం పంచాయతీ ఉపసర్పంచిగా ఉన్నారు.






