ఆదివరాహ స్వామిని దర్శించుకున్న మంథని కోర్టు ఏపీపీ కుమార్
26-08-2026 08:29 PM
కమాన్‌పూర్,(విజయక్రాంతి) మంథని కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్థ కుమార్–హాసిని దంపతులు బుధవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఏపీపీ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






