యుటిఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నాను జయప్రదం చేయండి
26-08-2026 08:40 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రేపు తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని టియస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కంచర్ల శ్రీనివాసరావు నండ్రు వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు అ రత్తమ్మ నీలం సైదారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎక్కువమంది తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. పిఆర్సీ ప్రకటించి, డిఎ లు విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సిపియస్ రద్దు చేయాలని, 2003 డియస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరారు.






