26 August, 2026 | 10:21 PM

కూతురి మరణం తట్టుకోలేక తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య

26-08-2026 09:35 PM

శామీర్ పేట్,(విజయక్రాంతి): కూతురు మరణం తట్టుకోలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం... అలియాబాద్ మున్సిపాలిటీ లాల్‌గడి మలక్‌పేట్‌కు చెందిన రాములు (50) మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

రాములుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా ఇటీవల తన కూతురు మరణించడంతో తీవ్ర మనస్థాపనికి గురై బుధవారం బొమ్మరాస్‌పేట్ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.