26 August, 2026 | 10:29 PM

1.960 కేజీల గంజాయి పట్టివేత

26-08-2026 08:48 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ డివిజన్ ఎన్ ఎఫ్ సి నగర్, ప్లాట్ నెంబర్ 177 శ్రీనివాసకాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఘట్ కేసర్ ఎక్సైజ్  సీఐ రవీందర్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో మాధవ్ నిఖిల్  (23) అనే యువకుడు వద్ద 1. 960 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మాధవ్ నిఖిల్ ను అరెస్టు చేసి  ఒక టూ వీలర్, సెల్ ఫోన్ లను కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.