అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఎల్బీనగర్, మార్చి 9 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే సుఎం రేవంత్ రెడ్డిని కూ డా కేసీఆర్ మాదిరిగా ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం భూ పోరాటం చేస్తామని తెలిపారు.
ఎల్బీనగర్‌లో ఉన్న పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మహా ప్రజా యాత్రలో భాగంగా సోమవారం ఎల్బీనగర్ నుంచి చలో ప్రజాభవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ... అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి, నేడు ఆరు గ్యారంటీ పథకాలు అడిగితే అరెస్టులు చేస్తా రా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేట్లకు ధారాదత్తం చేసిన ప్రభుత్వ భూములను తిరిగి పేదలకు పంపిణీ చేస్తానని చెప్పిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం కనీసం డబుల్ బెడ్ రూమ్‌లు అయిన నిర్మించింది, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ఇండ్లను కూల్చడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఎద్దేవా చేశారు. సుమారు 700 మంది సాగర్ రింగ్‌రోడ్డు నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, సీపీ ఎం నాయకులు తలపెట్టిన పాదయాత్రను అనుమతి లేదని ఎల్బీనగర్ పోలీసులు అడ్డుకుని జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు పోలీ సులు బలవంతంగా అదుపులో తీసుకోవడంతో చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రకు అనుమతి లేదనే అడ్డుకున్నామని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్ స్పెక్టర్ వినోద్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రమోహన్, ఆలేటి ఎల్లయ్య పాల్గొన్నారు.




