6 July, 2026 | 3:39 PM

Breaking News

శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •  

నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

01-05-2026 12:24 PM

నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా( Nizamabad district) ఎల్లారెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇందల్వాయి-ధర్పల్లి మధ్య రహదారిపై రైతులు బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కర్షకులు ఆందోళన చేపట్టారు. ధాన్యం తరలింపులోనూ జాప్యం జరుగుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు, బస్తాల తరలింపు వేగవంతం చేయాలని డిమాండ్  చేశారు. రోడ్డుపై ధాన్య పోసిన రైతులు ధర్నాకు దిగారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించారు.

వరి ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఐకేపీ, సొసైటీ అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నాయకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇవాళ వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. క్వింటాలుకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, 30 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడంలేదని సిరికొండ మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు.