10 March, 2026 | 8:51 AM

తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయం

10-03-2026 02:49 AM
  1. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోంది 
  2. కార్యకర్తల త్యాగాల పునాదిపైనే కేంద్రంలో అధికారం 
  3. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలి 
  4. పండిట్ దీన్‌దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): బీజేపీ దేశంలో ఎన్నో ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిందని, అణచివేత నుంచి అధికారం దిశగా దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదల ఒక వ్యక్తి వల్ల కాదు.. ఇది కోట్లాది కార్యకర్తల త్యాగాల ఫలితమని చెప్పారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రాష్ట్రాల్లో కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, వారి త్యాగాల పునాదులపై కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలోనూ కార్యకర్తలు అదే స్ఫూర్తితో పనిచేస్తే అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచి ప్రజల్లో మరింత విశ్వాసాన్ని సాధించిందని తెలిపారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాల యంలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్  రాంచందర్‌రావు పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు సెవెన్ సిస్టర్స్ స్టేట్స్‌గా పిలిచే ఈశాన్య రాష్ట్రాల్లో..

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తే వారిని కిడ్నాప్ చేయడం, హత్యలు చేయడం వంటి ఘటనలు జరిగేవని గుర్తుచేశారు. అలాంటి కఠిన పరిస్థితు ల్లో కూడా కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పోరాడినందువల్లే ఈరోజు ఆ ఏడు రాష్ట్రా ల్లో కూడా బీజేపీ బలంగా ఎదిగిందని తెలిపారు. 

దేశవ్యాప్తంగా విస్తరణ..

బీజేపీ ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన పార్టీగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించి తూర్పు, పడమర, దక్షిణ భారతదేశంలో కూడా బలమైన స్థానం సంపాదిం చిందని తెలిపారు. కర్ణాటకలో గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం గుర్తుచేస్తూ, కేరళలో కూడా తొలిసారిగా బీజేపీ ఎంపీ గెలవడం పార్టీ విస్తరణకు నిదర్శనమని అన్నారు. కేరళలో కమ్యూనిస్టు హింస వల్ల బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయనిపేర్కొన్నారు.

అయినప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పోరాడి పార్టీని బలపరిచారని అన్నారు. కేరళలో త్రివేండ్రం సహా పలు స్థానిక సంస్థల్లో బీజేపీ బలపడటం పార్టీ ఎదుగుదలకు ఉదాహరణగా తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకు మారి వరకు అనేక రాష్ట్రాల్లో కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపా రు. గుజరాత్‌లో అధికారంలోకి రాకముం దు కాంగ్రెస్ ప్రభుత్వం ‘టాడా’ చట్టాన్ని ఉపయోగించి బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని, బీహార్‌లో కూడా అనేక అణచివేతలు జరిగాయని గుర్తుచేశారు.

దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి పరిషత్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో జైలులో నిర్బంధించి నప్పటికీ ఉద్యమాలు ఆగలేదని చెప్పారు. అదే త్యాగస్ఫూర్తి, అదే కమిట్మెంట్‌తో పని చేస్తే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక వసతుల అభి వృద్ధి జరుగుతోందని, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మాణం, వందే భారత్ వంటి వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి రావ డం కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి దిశలో తీసుకున్న చర్యలేనని ఆయన వెల్లడించారు. 

రాష్ట్రంలో రజాకార్ల పాలన!

రాష్ట్రంలో ప్రజాపాలన నడవడంలేదని, రజాకార్ల పాలన నడు స్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. ఈమేరకు సోమవారం ఆయన ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు ఎంఐఎం అధినేత ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఎంఐ ఎం చేతుల్లో ఉందా? అంటూ నిలదీశారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాదు.. ఓవైసీ కోసం నడుస్తోందా? అంటూ ప్రశ్నించారు.