హాస్టల్ లో సీట్లు పెంచాలి
01-07-2026 03:14 PM
భైంసా(విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గం లోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో విద్యార్థులకు సీట్లను పెంచాలని విద్యార్థి సంఘాల నాయకులు నవీన్ డిమాండ్ చేశారు. బుధవారం పిసి సంక్షేమ శాఖ డివిజన్ అధికారి సత్యనారాయణ రెడ్డికి హాస్టల్ సీట్లు పెంచాలని వినతి పత్రం అందించారు. కుంటాల కుబీర్ తానూరు బైంసా మండలాల్లో హాస్టల్ సీట్లు దొరకక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సీట్లను పెంచాలని కోరారు.






