కొండా సురేఖ మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
03-09-2026 | 02:04pm
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్
హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) పేర్కొన్నారు.కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ అధిష్ఠానమే చూసుకుంటుందని వెల్లడించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనపై పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలని రాజగోపాల్ రెడ్డి( Rajagopal Reddy) ఆకాంక్షించారు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సహకారంతో మునుగోడులో రోడ్ల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధితో మునుగోడు(Munugode) ముఖచిత్రమే మారిపోతుందని తెలిపారు.
మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా(Konda Surekha's resignation) చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఒకవేళ ఆమె రాజీనామా చేయకపోతే, ఆమెను తొలగించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని TPCC క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. మంత్రివర్గం నుండి సురేఖను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది. చైర్మన్ మల్లు రవి నేతృత్వంలోని ఈ కమిటీ, సదరు సిఫార్సులతో కూడిన నివేదికను మంగళవారం TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించింది. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.






