3 September, 2026 | 4:18 PM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులకు మోసం, దగా

03-09-2026 | 03:02pm

తాండూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోహిత్ రెడ్డి .

తాండూరు, సెప్టెంబర్ 3, (విజయక్రాంతి): ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా....  రూ.2 లక్షల రుణమాఫీ... హామీలతో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా కూడా ఇచ్చిన మాటలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం, దగా చేసిందని వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Former Tandur MLA Pilot Rohit Reddy) విమర్శించారు. గురువారం పెద్దెముల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) నిర్వహించిన నిరసన లో పాల్గొని మాట్లాడారు. గ్యారెంటీ కార్డులతో 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగు సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కనీసం ఎరువుల అందించలేని దద్దమ్మ కాంగ్రెస్ పాలన అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీరు, వ్యవసాయ విద్యుత్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) వైఫల్యాలను ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషన్ రావు, రమేష్, జనార్ధన్ రెడ్డి, వెంకటేష్ చారి, డివై నర్సింలు, అంజి, వెంకట్ రెడ్డి, రవి, ధనసింగ్, జ్ఞానేశ్వర్, గోపాల్ రెడ్డి, డివై ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..