సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ నేతలు అరెస్ట్
40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ నాశనం చేసింది
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ (Ramchander Rao), ఎంపీ డీకే అరుణతో సహా పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను(Fee reimbursement dues) విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ సచివాలయం ముందు నిరసన చేపట్టిన అత్యంత భద్రత నడుమ ఉన్న సచివాలయం వద్దకు బీజేపీ నాయకులు(BJP leaders) నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా రావడంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు. అయితే, పోలీసులు వెంటనే వారిని ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిందని బీజేపీ అధ్యక్షుడు (BJP State President N. Ramchander) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం, రావలసిన రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమవడం వల్ల, ఈ 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు, ఉద్యోగాలు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. 'నేను నిరాహార దీక్ష చేపట్టాను, ముఖ్యమంత్రికి లేఖలు రాశాను, విద్యార్థుల నుండి 8 లక్షల సంతకాలతో కూడిన వినతిపత్రాలను కూడా సేకరించాను. అయినా, సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం వారి కోసం ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇదే అహంకారం. ఇదే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వ్యతిరేక మనస్తత్వం. ఈ విద్యార్థుల గొంతును నేరుగా ప్రభుత్వానికి వినిపించడానికి నేను నేరుగా సచివాలయానికి వెళ్లాను!' అని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.






