3 September, 2026 | 4:18 PM

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

03-09-2026 | 02:56pm

పటాన్ చెరు, సెప్టెంబర్ 3: ముత్తంగి డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ముత్తంగి ప్రాంతంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందేలా అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.