3 September, 2026 | 4:16 PM

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

03-09-2026 | 03:06pm

మల్లాపూర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసమైందని ఆరోపించారు.

రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు బీమా అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, రైతులకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.