1 July, 2026 | 4:02 PM

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

01-07-2026 03:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో చదువుతున్న దళిత విద్యార్థుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రంజిత్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు యాజమాన్యం పుస్తకాలు కాపీలు డ్రెస్సులు ఇవ్వకుండా చదువు చెప్పమని ఇంటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.