కేబినెట్ నుంచి “కొండా సురేఖ బర్తరఫ్”
కొండా సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్ లైన్ క్లియర్
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు(Konda Surekha) కాంగ్రెస్ అధిష్ఠానం బిగ్ షాకిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు(Governor Shiv Pratap Shukla) సిఫారసు పంపించారు.
తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేశారు. చిన్నారెడ్డి స్థానంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మిని(Gadwal Vijayalakshmi) నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి ఆమోదం తెలిపారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ శ్ జి. సుధారాణి నియామకానికి ఆమోదం తెలిపారు.






