calender_icon.png 14 February, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు

14-02-2026 12:00:00 AM

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపిన తుంగతుర్తి రవి

మేడిపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ  స్థానిక చెరువులలో చాలా కాలంగా పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులను అధికారులు ముమ్మరంగా చేపట్టారు.

ఈ గుర్రపు డెక్క కారణంగా దోమల పెరుగుదల విపరీతంగా పెరిగి, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులపై  యంత్రాంగం తక్షణమే స్పందించింది.ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని, డిప్యూటీ కమిషనర్  శైలజ, అధికారుల చొరవతో, యం త్రాల సహాయంతో చెరువులను శుభ్రం చేసే పనులు ఆరంభించారు.

ఈ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ గుర్రపు డెక్క నివారణకు సహకరిం చిన డిప్యూటీ కమిషనర్ శైలజ కి, అధికారులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. చెరువుల లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించడం వల్ల దోమల బాధ తప్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.