14-02-2026 12:00:00 AM
* ‘పరిపాలన అంటే కేవలం ఫైళ్లపై సంతకాలు చేయడం కాదు.. ప్రజల జీవితాలను సులభతరం చేయడం’ అని అంటున్నారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్(సీఎంసీ) కమిషనర్ జీ సృజన. అధికారం అనేది ప్రజలపై పెత్తనం చెలాయించడానికి కాదని, వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఒక సాధనమన్నారు.
పారిశుధ్యం, రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని, క్షేత్రస్థాయిలో పక్కా ఫీడ్‌బ్యాక్‌తో పర్యవేక్షిస్తానని చెప్పారు. ‘ప్రజల ఎదుగుదలే నా బాధత్య సమస్యల పరిష్కారానికి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తా. మొత్తం మీద ప్రజాశ్రేయస్సేకు వారధిగా ఉండటమే తన లక్ష్యం’మన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె తన ప్రాధాన్యతలు, పాలనా విధానాలపై ‘విజయక్రాంతి’తో శుక్రవారం ప్రత్యేకంగా మాట్లాడారు.
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): తన పనితీరులో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని సైబరా బాద్ మున్సిపల్ కమిషనర్(సీఎంసీ) కమిషనర్ జీ సృజన తెలిపారు. డిసిప్లిన్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది తన నినాదమని, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తన లేక పోతే ఎంతటి మేధావి అయినా పరిపాలన లో రాణించలేరని ఆమె అభిప్రాయపడ్డా రు. నిత్య విద్యార్థిలా ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపే ఆమె, నేర్చుకోవాలనే తపన ఆగిపోయిన రోజే ఎదు టగుదల ఆగిపోతుందని పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఒత్తి డి సహజమని, అయితే ప్రజల కష్టాలను తీర్చలేక పోయినప్పుడే తాను నిజమై న ఒత్తిడికి గురవుతానని, సమస్య పరిష్కారమే తనకు అసలైన ఉపశమనం అని వివరించారు. సీఎంసీ పరిధిలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ఎక్కడా రాజీ పడకుం డా అవినీతి రహిత పాలన అందించడమే తన ధ్యేయమని కమిషనర్ స్పష్టం చేశారు.
సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూ డదని అధికారులకు, సిబ్బం దికి కఠిన ఆదేశాలు జారీ చేశారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా వెంట నే స్పందించి పరిష్కరించాలని, యంత్రాం గం పనిచేయాలని ఆమె ఆదేశించారు. సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందు బాటులో ఉండాలని, బాధ్యతా రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రజలు ధైర్యంగా సమస్యలు తెలపాలి
సీఎంసీలోని ప్రజల సమస్యలపై తన ఫోకస్ నిరంతరం ఉంటుందని కమిషనర్ సృజన భరోసా ఇచ్చారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకురావాలని, నిష్పక్షపాతం గా, వేగంగా సేవలు అందించడానికి మున్సిపల్ యంత్రాంగం సిద్ధంగా ఉందని పిలుపునిచ్చారు. సామాన్యుడికి మేలు జరిగినప్పుడే తన ఉద్యోగం పూర్తయిందని భావిస్తానని అన్నారు.
పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై ఫోకస్
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు శానిటేషన్ తన మొదటి ప్రాధాన్యం ఉంటుందని సీఎంసీ కమిషనర్ సృజన వెల్లడించారు. నగరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, దీనిపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పారిశుధ్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ముఖ్యంగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయనే అంశంపై కేవలం ఆఫీసు రిపోర్టులనే నమ్మకుండా.. మీడియా, సోషల్ మీడియా ప్రజల నుంచి నేరుగా వచ్చే అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుని పర్యవేక్షిస్తానని తెలిపారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయని తెలిస్తే తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు.