5 May, 2026 | 6:56 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ప్రలోభాలకు లొంగి పార్టీ మారొద్దు: గంప గోవర్ధన్

24-12-2025 09:30 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి.. పార్టీ మారవద్దని కామారెడ్డి  మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వెలమ కన్వెన్షన్ హాల్​లో బుధవారం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ... రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు.

వచ్చే రెండేళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు విడుదల చేయబోదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని సర్పంచులుగా గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదర్శంగా నిలవాలని సూచించారు. కేసీఆర్  చూపిన బాటలో నడిచి పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అప్పుడు గడిచిన రెండు సంవత్సరాల నిధులను విడుదల చేసి గ్రామాల రూపురేఖలను మార్చడానికి పనిచేస్తామని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ ఏమైనా ఇబ్బందులు పెడితే జిల్లాలో లీగల్ టీంను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి ఖర్చు లేకుండా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రేంకుమార్, మాజీ జెడ్పీటీసీలు గోపి గౌడ్, రాంరెడ్డి, నల్లవెల్లి అశోక్, పార్టీ మండలాధ్యక్షుడు బాలచంద్రం, రాజాగౌడ్, ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బలవంత్ రావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.