19 May, 2026 | 3:42 AM

జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణికి సన్మానం

19-05-2026 01:10 AM

గాంధారి, మే 18 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంగెం గ్రామానికి చెందిన బానోత్  ఉష పలు మార్లు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎస్.జి.ఎఫ్. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది.. బానోత్ ఉష జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేట్ సంగెం లో పదవ తరగతి మార్చ్ 2026 లో పూర్తి చేసింది.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో విద్యా వారోత్సవాల్లో భాగంగా  జాతీయ స్థాయిలో రాణించిన ఉషను  జెడ్పీ సీఈవో చందర్ నాయక్ 10వేల రూపాయలు, ప్రశంసా పత్రం అందచేసి శాలువాతో సన్మానం చేసినట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రాజు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.