అవోపా జిల్లా కార్యదర్శి కొమురెల్లి వెంకటేశం కు సత్కారం
21-07-2026 03:12 PM
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా ఆవోప అధ్యక్షుడు, జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి వెంకటేశం పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహంలో సిక్సర్ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. సభ్యులైన కట్కూరు సుధాకర్, చీకోటి శ్రీనివాస్, గాంధీ, కొండూరి శ్రీనివాస్, బొడ్ల లక్ష్మీనారాయణ, జిల్లా అంజయ్య, చిలువేరి అశోక్, కుమార్, నాగమల్ల మునీందర్ లు కలిసి శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ కొమురవెల్లి వెంకటేశం సేవా తత్పరత అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.






