21 July, 2026 | 7:36 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

గాగిల్లాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

21-07-2026 03:34 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, బాలవికాస సంస్థ సహకారంతో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొత్తం 214 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా, 186 మందికి షుగర్ పరీక్షలు, 78 మందికి ఈసీజీ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు నిర్వహించి, వైద్యుల సలహాలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సర్పంచ్ ఎర్రల జానకి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.