21 July, 2026 | 6:59 PM

కోల్ బెల్ట్ లోవర్షంతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

21-07-2026 03:04 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సింగరేణి భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి స్థానిక ఓసీపి 2, 3 ఉపరితల గనులలో నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో దాదాపు 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపాయి.