21 July, 2026 | 7:37 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

21-07-2026 03:40 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని  జవహర్ నవోదయ విద్యాలయం లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి , నిజాంసాగర్ శ్వై. తిరుపతి రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం నాడు  మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ...  ప్రస్తుతం నిజాంసాగర్ మండలంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 31-07-2026. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులతో సకాలంలో దరఖాస్తు చేయించాలని కోరారు. దరఖాస్తులను నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనిఆయన విజ్ఞప్తి చేశారు.