10 April, 2026 | 3:26 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి వైద్యం మంచి మార్గం

10-04-2026 01:19 PM

- జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్. 

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి వైద్యం మంచి మార్గమని నాగర్‌ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్‌లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం  ఆయుష్ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. హోమియోపతి సహజసిద్ధమైన, సురక్షితమైన వైద్య విధానమని, శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యల చికిత్సలో హోమియోపతి ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ గోపాల్ నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉషారాణి, వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.