14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు

02-05-2026 06:41 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్ ఆఫీసర్ సురేష్ కు శనివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ప్రధమ చికిత్స అందిస్తుండగానే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత హాస్పిటల్ లో ఉన్న హోంగార్డ్ ఆఫీసర్ సురేష్ భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నివాళులర్పించారు. ఎల్లప్పుడూ చురుకుగా విదులు నిర్వర్తించే సురేష్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం పట్ల ఎస్పీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులను పరామర్శించి,తదుపరి కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని అధికారులకు సూచించారు.