నాగిరెడ్డిపేట్ మండలంలో ఘనంగా హోలీ సంబరాలు
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలు నిర్వహిస్తారు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి తమ తమ ప్రాంతాలలో చిన్న,పెద్ద తేడా లేకుండా యువతీ, యువకులు, మహిళలు పెద్దలు ఒకరిపై ఒకరు, రంగులను చల్లుకొని హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు ఉదయం నుండే చిన్న చిన్న కర్రలతో జాజిరి పాటలు పాడుతూ,జాజిరి ఆటలు ఆడారు. హోలీ పర్వదినంతో నాగిరెడ్డిపేట్ మండలంలోని గ్రామాల కాలనీలన్నీ రంగుల మయంగా మారి యువతి యువకుల్లో సందడి వాతావరణం నెలకొంది.
నాయకులు ఒకరు ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రతియేటా ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి తిథి రోజు ఈహోలీ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. కులమత బేధాలు లేకుండా జరుపుకునే ఈహోలీ పండుగ వసంతకాలపు రాకను, ప్రేమ, ఐక్యత, సంతోషం, పాత గొడవలను మరచి కొత్త బంధాలను ఏర్పరచుకోవడాన్ని సూచిస్తుంది. గోపాల్పేట్ హోలీ పండుగ వేడుకల్లో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.




