30 April, 2026 | 2:51 AM

పదో తరగతి ఫలితాల్లో జయ కేతనం

30-04-2026 01:32 AM

సూర్యాపేట, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో జయ పాఠశాల విజయకేతనం ఎగరవేసినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్ లు బింగి జ్యోతి, జెల్లా పద్మలు తెలిపారు.ఫలితాలు వెలువడిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ డి.రిత్విక 596 మార్కులతో స్టేట్ రెండవ ర్యాంక్ సాధించడంతోపాటు 11 మంది విద్యార్థులు 590 పైన మార్కులు సాధించారని తెలిపారు.

అలాగే 61 మంది 580, 143 మంది 570 ఆపైన, 238 మంది 560 పైన, 330 మంది 550, 586 మంది 500 ఆ పైన మార్కులతో పాటు హాజరైన ప్రతి ముగ్గురిలో ఇద్దరు విద్యార్థులు 500 ఆ పైన మార్పులు సాధించారని తెలిపారు. దాసరి రిత్విక 596 బోడ ప్రసన్న 595 కట్ట దేవి ప్రియ 594 పోతుగంటి శ్రీ శ్వాస 594 బుడిగ సాన్విక 593 తిప్పన శ్రీజ రెడ్డి 593  కై రోజు హేమంత్ సాయి 592 భూ రెడ్డి హర్షిత 591 కక్కిరేణి ప్రజ్వల 591 నిమ్మల వైశాలి 591 తోవిటి సహస్ర 591 సాధించినట్లు  ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యా ర్థులను కృషి చేసిన అధ్యాపక బృందాన్ని సహకారం అందించిన తల్లిదండ్రులను అభినందనలు తెలిపారు.