5 August, 2026 | 3:39 AM

హెచ్‌ఎంటీని డిఫెన్స్ పరిధిలోకి తేవాలి

05-08-2026 12:25 AM

కేంద్రమంత్రి కుమార స్వామిని కోరిన ఎంపీ ఈటల

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని హెచ్‌ఎంటీని డిఫెన్స్ పరిధిలోకి తీసుకొచ్చి ఆయుధ విడిభాగాల తయారీలో వినియోగించాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని ఈటల రాజేందర్‌తోపాటు ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడెం నగష్ కలిశారు. ఈ సందర్భంగా సీసీఐ ఆదిలాబాద్ ఫ్యాక్టరీ, భెల్ తదితర సమస్యలపై మంత్రితో చర్చించారు.