లవ్ జిహాద్ పట్ల హిందువులు అప్రమత్తంగా ఉండాలి
04-03-2026 12:00 AM
‘దా కేరళ స్టోరీ-2’ చిత్రాన్ని వీక్షించిన ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్
ముషీరాబాద్, మార్చి 3(విజయక్రాంతి): లవ్ జిహాద్ ముసుగులో హిందూ అమ్మాయిలు ఎందరో బలవుతున్నారని, హిందూ బిడ్డలు అప్రమత్తంగా ఉండాలని ఓబీసీ మో ర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆర్టీ సీ క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ థియేటర్లో ‘దా కేరళ స్టోరీ-2’ చిత్రాన్ని పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆయన వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ భరత్ గౌడ్ కో కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు, పూసరాజు, బీజేపీ నేతలు శక్తిసింగ్, వెంకట్ రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




