6 July, 2026 | 2:48 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

గాలి వాన భీభత్సం

03-05-2026 05:21 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో  కొత్తూరు మొట్లగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలి వాన భీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం కొత్తూరు మొట్లగూడెం గ్రామంలో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం పడడంతో పలు గుడిసెలు దెబ్బతిన్నాయి. ఒకటి, రెండు గుడిసెలు కూలాయి. గుడిసెలపై ఉన్న పరదాలు గాలికి ఎగిరి కొట్టుకుపోయాయి.  చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కోతకు వచ్చిన వారి చేలు నేలవాలడంతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది.