రాష్ట్ర స్థాయి స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు 2వ డివిజన్ చాపల హేమ ఎంపిక
03-05-2026 05:06 PM
పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ, కొత్తగూడెం కార్పొరేషన్ రెండవ డివిజన్ నివాసి చాపల హేమ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ ఎంపికైనది. జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి హేమ రాష్ట్రస్థాయికి ఎంపి కావడం పట్ల డివిజన్ కార్పొరేటర్ భవిత కిరణ్ మలంపాటి హర్షం వ్యక్తం చేశారు. కోచ్ కొనే సూరిబాబు అభినందించారు. ఈ సందర్భంగా రెండవ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు శిక్షణ గురువులతో పాటుగా డివిజన్ కు మంచి గుర్తింపు తేవాలని అభినందించారు.






