పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్
పల్లా దేవేందర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి
దేవరకొండ,(విజయక్రాంతి): పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్. అని పల్లా దేవేందర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. అన్నారు. శనివారం సిపిఐ దేవరకొండ మండల సమితి ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పల్లా పర్వత్ రెడ్డి భవన్ నుండి బస్ స్టాడ్ వరకు ఆటో కు తాళ్లుకట్టి లాగి ర్యాలీతో వెళ్లి 167 జాతీయ రహదారిపైన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెట్రోల్ డీజిల్ పై విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా మేము పెట్రోల్ డీజిల్ పై ఎటువంటి ధరలు పెంచమని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మిస్తూ ఎన్నికలు అయిపోయిన వెంటనే రేట్లు పెంచుతూ మోసం చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి.
కాబట్టి ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతున్నామని మాట్లాడుతున్న బిజెపి కేంద్ర సర్కార్ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఎందుకు ఇక్కడ ధరలు తగ్గించలేదో సమాధానం చెప్పాలని అన్నారు. విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకోవటంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు, పల్లా రంగారెడ్డి, జూలూరి వెంకట్రాములు, నీలా వెంకటయ్య, ఎండి మైనొద్దీన్,గంగిడి రాంరెడ్డి,కిన్నెరా యాదయ్య,మహిళ సమాఖ్య డివిజన్ అధ్యక్షురాలు లింగంపల్లి అనిత, సభ్యులు జూలూరి జ్యోతిబస్, తోటపల్లి నగేష్.తదితరులు పాల్గొన్నారు.






