16 August, 2026 | 7:48 PM

జనసంద్రంగా యాదగిరి కొండ..

16-08-2026 06:55 PM

భక్తులతో కితకితలు ఆడిన పురవీధులు...

యాదగిరిగుట్ట, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారాలు సెలవు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో వేకువ జామున సుప్రభాతం, అభిషేకము అర్చన, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణము, సాయంత్రం వెండి జోడి సేవను భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శాస్త్రోక్తంగా నిత్య పూజలను నిర్వహించారు. 

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈనెల 21న శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలోని కొండ కింద వ్రతమంటపం హల్ నెంబర్ 2 లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొనే మహిళలు ఆగస్టు 19 తేదీ వరకు తమ పేరును నమోదు చేసుకుని వరలక్ష్మి వ్రతంలో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య రాబడి  66.77.232/- వచ్చినట్లు ఆలయాధికారి తెలిపారు.