16 August, 2026 | 7:32 PM

ఘనంగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

16-08-2026 06:51 PM

యాదగిరిగుట్టలో జననీరాజనం......

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న గొంగిడి దంపతులు....

యాదగిరిగుట్ట, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు బిఆర్ఎస్ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం కొండ కింద రాజగోపురం వద్ద జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గంలోని మండలాల బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు జన్మదిన వేడుకలను శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలతో రాబోయే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో కేసీఆర్ నమ్మిన బంటుగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని బిఆర్ఎస్ సర్పంచులు, జడ్పిటిసిలు,ఎంపీపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.