11 June, 2026 | 2:33 AM

‘పెద్ది’టికెట్ ధరల పెంపు

11-06-2026 01:24 AM

హోం శాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు హోంశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజు లపాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఈ నెల 2న హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మెమో ఇచ్చారని దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

హోం శాఖ జారీ చేసిన మెమో అక్రమమని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో జీవో 121ను అనుసరించాలని సూచించింది. హోం శాఖ నుంచి వివరాలు సేకరించడానికి సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 15కి వాయిదా వేసింది.