11 April, 2026 | 3:43 AM

హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో హైలైఫ్ ఎగ్జిబిషన్

11-04-2026 01:42 AM

ప్రారంభించిన ప్రముఖ నటి నిధి అగర్వాల్, పలువురు సెలబ్రిటీలు

మూడు రోజుల పాటు నిర్వహణ 

ప్రత్యేక ఆకర్షణగా వేసవి ట్రెండ్స్ ఏర్పాటు

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): అతిపెద్ద ఫ్యాషన్ అండ్ లైప్‌స్టుల్ ఎగ్జిబిషన్ బ్రాండ్ హైలైఫ్ ఎగ్జిబిషన్ వేసవి ఫ్యాషన్లు, పండుగ దుస్తులు, హాట్ కౌచర్, వేసవి వివా హ కలెక్షన్, వధువు దుస్తులు, ఆభరణాలు, డిజైనర్ దుస్తులు, లైఫ్‌స్టుల్ మరెన్నో ప్రదర్శించే సమ్మర్ ట్రెండ్స్ స్పెషల్ ఎగ్జిబిషన్‌ను పరిచయం చేస్తోంది.

ఈ నెల10,11,12 తేదీ ల్లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, నోవోటెల్, హెచ్‌ఐసీసీలో జరుగుతుంది.హై-లైఫ్ ఎగ్జిబిషన్ పండుగలు, జీవనశైలి,వివాహ షా పింగ్ కోసం అత్యంత ప్రసిద్ధమైన, అత్యంత ఆదరణ పొందిన, అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాం డ్లలో ఒకటి,ఈ సందర్భంగా హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ అండ్ సీఈఓ అబీ డొమినిక్ మా ట్లాడుతూ, హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత కలిగిన లైఫ్‌స్టుల్, లగ్జరీ అండ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రాండ్‌గా నిలిచిందని అన్నారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ -నోవోటెల్‌లో జరుగుతున్న హైలైఫ్ ఎగ్జిబిష న్ సమ్మర్ ట్రెండ్స్ స్పెషల్ ఎగ్జిబిషన్‌లో 350 మందికి పైగా డిజైనర్లు పాల్గొంటున్నా రు. ఇందులో కొన్ని అత్యంత ప్రత్యేకమైన సమ్మర్ ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్స్, పెళ్లి, పండుగల ప్రత్యేకతలతో పాటు పూలు, ప్రకాశవం తమైన రంగులు మరెన్నో ప్రదర్శించబడుతున్నాయి.

‘సమ్మర్ ట్రెండ్స్ స్పెషల్స్ అండ్ సమ్మర్ ఫ్యాషన్స్, వెడ్డింగ్ వేర్, బ్రైడల్ వేర్, జ్యువెలరీ, చీరలు, లగ్జరీని ఒకే చోట అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. పరి శ్రమలోని అత్యుత్తమమైన వాటి నుంచి మా సందర్శకులకు ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం’. అని తెలిపారు. కాగా, హైలైఫ్ ఎగ్జి బిషన్ దేశంలోనే తన రకంలోనే అతిపెద్ద ఫ్యాషన్ & లైఫ్స్టైల్ ఎగ్జిబిషన్. దీనికి కారణం, ఇందులో ఉండే అగ్రశ్రేణి ఫ్యాషన్ లేబుల్స్, ప్రముఖ డిజైనర్లు, కళాత్మకమైన కలెక్షన్. ఇవి షాపింగ్ చేసేవారికి దీనిని తప్పక సందర్శించవలసిన ఎగ్జిబిషన్‌గా చేస్తాయి.