అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు
27-07-2026 04:28 PM
నిర్మల్ జులై 27 (విజయక్రాంతి): భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను సోమవారం జరుపుకున్నారు. కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, నిర్మల్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కె. రమేష్ అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్, మాజీ కౌన్సిలర్ షేక్ సయీద్ (సలీం), షేక్ ఇంతియాజ్ అహ్మద్, మొహమ్మద్ మిన్హాజ్, మీర్జా షోయేబ్ బేగ్, హనుమంత్ రెడ్డి, పోతన్న, తయ్యబ్ చౌష్ పాల్గొన్నారు.






